Statistics
We have 1606 registered users
The newest registered user is DATLA JESWANTH VARMA

Our users have posted a total of 1271 messages in 192 subjects

telugu comedy

Go down

telugu comedy

Post by RAMAKRISHNAMRAJU on Thu Oct 01, 2009 3:31 pm


డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్ర్రిప్షన్ మందుల షాపువాడికి ఇచ్చి "ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి" అని అడిగాడు సురేష్

"రెండెందుకండీ...?" అమాయకంగా అడిగాడు సేల్స్‌మేన్

"ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు కాబట్టి... ఒకటి ఇంట్లోకి, రెండోది ఆఫీసులోకి..!!"

___________________________________


ఓ చోట సదానంద స్వామివారు జీవహింస గురించి ఉపన్యాసమిస్తున్నారు.

అది వినడానికి వెంకటేశం అక్కడకు వెళ్లాడు. ఆ సమయంలో స్వామివారు ఈ విధంగా చెప్తున్నారు

"భక్తులారా జీవ హంస చాలా పాపం అందుకనీ మీరు జీవ హింస చేసి సంతోషించరాదు"
___________________________________


తన స్నేహితురాలు సుధ వెన్నంటి ఎప్పుడూ ఓ గాడిద రావడాన్ని గమనించిన సుమతి ఇలా అంటోంది

సుమతి : "ఏమే సుధా..? ఎప్పుడూ నీ వెనకాలే ఆ గాడిద ఎందుకు వస్తోందే..?"

సుధ : "అదేం లేదే నాకు వచ్చిన లవ్ లెటర్లన్నీ దానికే ఇచ్చాను. అవి తినడంతో అది నా వెనుక విశ్వాసంతో వస్తోంది...!"

"ఇది విన్న వెంకటేశం ఆ మాటను కాస్త గట్టిగా చెప్పండి. నా భార్య కూడా వింటుంది..!" అన్నాడు పక్కన కూర్చున్న భార్యను భయంతో చూస్తూ..
___________________________________
తహసిల్దార్ ఆఫీసులో పనిచేసే వినోద్ ఇంట్లో కూర్చుని ఏకాగ్రతతో పుస్తకం చదువుతున్నాడు.

ఆ సమయంలో ఉన్నట్టుండి కరెంట్ పోయింది. చిరాగ్గా ఈబీలో పనిచేసే రామారావుతో ఇలా అన్నాడు

"ఒరేయ్ రామారావు ఏమిట్రా? వేళాపాళా లేకుండా కరెంటు పోయింది. అయినా ఇది వేసంకాలం కూడా కాదే..!"

"సర్టిఫికేట్ కోసం ఈబీ వాళ్లొస్తే.. దసరా మామూళ్ల కోసం, ఆఫీస్ చుట్టూ తిప్పావట కదా అందుకే ఇలా..!" అసలు విషయం చెప్పాడు రామారావు.

___________________________________


తల్లి : "నెల క్రితమేగా పెళ్లైంది. అంతలోనే విడాకులు కావాలంటున్నావు దేనికే..?"

కూతురు : "మొన్న రాత్రి ఆయన నా మనసును గాయపరిచే మాట అన్నారు"

తల్లి : "ఏమన్నాడు..?"

తల్లి : "నాకు వంట చేయడం రాదని అన్నాడు...!"
___________________________________
తనకొచ్చిన రోగం గురించి డాక్టరుతో సుమంత్ ఇలా అన్నాడు

సుమంత్ : "డాక్టర్ నాకో జబ్బు వచ్చింది."

డాక్టర్ : "ఏంటది..?"

సుమంత్ : "ఏం లేదు డాక్టర్ అన్నం తిన్న తర్వాత ఆకలేయట్లేదు".
___________________________________
"వెంకయ్యా నీకీ విషయం తెలుసా..? నేను పేపర్ చదవడం మానేశానోయ్" చెప్పాడు సుందరయ్య

"ఎందుకు..? బిల్లు ఎక్కువవుతుందని మానేశావా..?" అడిగాడు వెంకయ్య

"అబ్బే అదేంలేదు.. మా పక్కింటి వాళ్లు పేపర్ తెప్పించడం మానేశారుగా..!" అసలు విషయం చెప్పాడు సుందరయ్య.
___________________________________


"మా ఆయనకు ఈ మధ్య తెలివి చాలా ఎక్కువైందే" సంబరంగా చెప్పింది రాధ

"ఏంటే అలా అంటావు ఏమైందేంటి" ఉత్సాహంతో అడిగింది సుజాత

"నాకు షార్ట్ హ్యాండ్ రాదని ఆయన కొలీగ్‌కు షార్ట్ హ్యాండ్‌లో లెటర్లు రాస్తున్నారే..! అసలు విషయం చెప్పింది రాధ.
___________________________________

"ఏం చేస్తున్నావురా..?" అడిగాడు తండ్రి

"స్టడీ చేస్తున్నా నాన్నా..?" చెప్పాడు కొడుకు

"ఎవరిని స్టడీ చేస్తున్నావురా..?"

"పక్కింటి అమ్మాయిని..!".
___________________________________


"ఈ రోజు ఓ ఆర డజను సూపర్ బజార్లు తిరిగానయ్యా? అయినా నాకు కావాల్సింది ఎక్కడా దొరకలేదు.." నిరుత్సాహంగా చెప్పాడు సుందర్

"అలాగా.. ఇంతకీ నీకు కావల్సింది ఏమిటో..?" అడిగాడు రమేష్

"ఇంకేముందీ... అప్పే కదా..!" చెప్పాడు సుందర్.
___________________________________"పిల్లికి ఎలుకకు గల సంబంధం ఏమిటీ?" అని అడిగారు మాష్టర్ స్టూడెంటును...

"భార్యా భర్తల సంబంధం సార్...!" వెంటనే తడుముకోకుండా చెప్పాడు అల్లరి స్టూడెంట్.
___________________________________
"నీ భార్యను ఎందుకు చంపావు? అని అడిగాడు జడ్జి" ముద్దాయిని...

"పసుపు కుంకుమలతో పోవాలని కోరితేనూ..!" బాధపడుతూ చెప్పాడు ముద్దాయి.
___________________________________
"కులవృత్తిని నమ్ముకుంటే బాగుపడతారని అంటే.... కులవృత్తిని చేపట్టాను... అయినా నన్ను జైల్లో పెట్టారు.."

"అది ఎలాంటి కుల వృత్తి...?"

"మా తాత ముత్తాతల నాటి దొంగతనం!"

for more comedy on http://nanigadu.tk


Last edited by RAMAKRISHNAMRAJU on Thu Oct 01, 2009 3:39 pm; edited 3 times in total
RAMAKRISHNAMRAJU
RAMAKRISHNAMRAJU
Moderator
Moderator

Surname : Champati
Gotram : Dhanumjaya
Male
Age : 32
Number of posts : 92
Job/hobbies : Designer/hobbies ante chala unnai navol chaduvutaa.. novala & stories rastaa.... (telugu & tamil lo) inka chinnapillalato aadokovadam ante chala chala istam, friends tho chating..........
Relationship Status : Single
Points :
0 / 1000 / 100

Reputation : 0
Registration date : 2009-07-01

View user profile http://telugukshatriyaas.blogspot.com

Back to top Go down

Re: telugu comedy

Post by RAMAKRISHNAMRAJU on Thu Oct 01, 2009 3:33 pm

[size=18][size=24]
RAMAKRISHNAMRAJU wrote:"
ఏరా? సత్యం కాలేజీ నుంచి రామ్ కాలేజీకి మారావట... ఏంటి సంగతీ...?

"
చెత్త కాలేజ్ ఒక్కరు సరిగ్గా లేదు..."

"
ఎవరు ప్రొఫెసర్లా!?"

_____________________________

"
మీ అబ్బాయిని లాయర్ చదివించావుగా? ఎలా ఉంది ప్రాక్టీస్?"

"
ఏం ప్రాక్టీసో.. ఏమోగానీ..."

"
మొదట ఆస్తిలో వాటా కావాలని" కేసును నా మీదే పెట్టాడు..!!!

_____________________________

"
ఏమనుకుంటున్నావో ఏమో..! నాకు గనక కోపం వస్తే ఈ ప్రపంచం అంతా మాడి మసైపోక తప్పదు..!" బెదిరిస్తూ అన్నాడు భర్త

"
అంత వద్దులే గానీ.., ముందు కాస్త ఈ పొయ్యి వెలిగించి చూపండి చాలు..!" తిక్క కుదిరేలా బదులిచ్చింది భార్య.
_____________________________

"
నీ చిన్ననాటి కల ఇప్పటికి నిజమయ్యిందిరా.." చెప్పాడు రంగారావు

"
ఏంటది..?" అడిగాడు సుబ్బులు

"
మా మాస్టారు కొట్టినప్పుడల్లా జుట్టు లేకుండా ఉంటే బాగుండునని కలలుకనేవాణ్ణిలే..!!"
_____________________________"
అయ్యో.. బేరర్.., నాకిచ్చిన టీలో ఈగ తేలుతోంది చూడు.." గాబరాగా అన్నాడు కస్టమర్

"
కొద్ది సేపు ఆగండి సార్.., అదే మునిగిపోతుంది.." నింపాదిగా బదులిచ్చాడు బేరర్.
_____________________________

"
ఒక
అమ్మాయికి ప్రపోజ్ చెయ్యాలంటే ఈ రోజే కరెక్ట్టు..ఒక వేళ ఒప్పుకుందనుకోండి
సంతోషమే ..లేదా నో అందంటే, అక్కా ఏప్రిల్ ఫూల్ అని వేరే అమ్మాయీని వెతికే
పనిలో పడొచ్చు !!" చెప్పుకుంటూ పోతున్నాడు సుధీర్

"
నీ
కథ అలా ఉంచితే.. నా భార్యామణికి వడ్డాణం చేయిస్తానని ప్రామిస్ చెయ్యడానికి
ఇంతకు మించిన తరుణం లేదు" అని అన్నాడు కొత్తగా పెళ్లయిన వినోద్.
_____________________________"
కులవృత్తిని నమ్ముకుంటే బాగుపడతారని అంటే.... కులవృత్తిని చేపట్టాను... అయినా నన్ను జైల్లో పెట్టారు.."

"
అది ఎలాంటి కుల వృత్తి...?"

"
మా తాత ముత్తాతల నాటి దొంగతనం!"
_____________________________

సుధ : "డాక్టర్ మా తాతగారిని ఎలాగైనా బ్రతికించండి..!"

డాక్టర్ : "ఆహా ఈ రోజుల్లో కూడా తాతగారిపై ఎంత ప్రేమమ్మా నీకు..!"

సుధ : "అది కాదు డాక్టర్ ఈ ఏడాది బ్రతికుంటే నా పుట్టినరోజుకు స్కూటీ కొనిస్తానన్నారు..!"
_____________________________

మహాలక్ష్మి : "వదినా మీ అబ్బాయికి పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేస్తానని అప్పుడెప్పుడో అన్నావు కదా..?"

కవిత : "అవును వదినా ఈ కాలంలో పైసలు చెల్లవు కనుక అలా అన్నాను..!"
_____________________________
అప్పుడే సినిమాకెళ్లొచ్చిన సుందరిని చూసి సుభద్ర ఇలా అడిగింది

సుభద్ర : ఏమే సినిమాకెళ్లావు కదా ఎలా ఉంది?

సుందరి : "ఏమోనే నేను చూడలేదు..!"

సుభద్ర : "అదేమిటి సినిమాకెళ్లావు కదా చూడలేదంటాటేవిటే..?"

సుందరి : "నా ప్రక్కన కూర్చున్నావిడ మెళ్లో వజ్రాల హారం చూశాక నాకింకేమి కనిపించలేదే..!"
_____________________________

"
మా
నాన్నగారి డెత్ సర్టిఫికేట్ ఇస్తేగానీ.. మా అమ్మకు పెన్షన్ ఇవ్వరట...
అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్‌గారూ...!" అన్నాడు హరి

"
ఓ అలాగా... దానికేం భాగ్యం, ఇంతకీ మీ నాన్నగారికి వైద్యం చేసిన డాక్టర్ ఎవరు?" అడిగాడు డాక్టర్ సుందర్

"
మా నాన్నగారు చాలా అదృష్టవంతులండీ... ఏ డాక్టరూ వైద్యం చేయకుండానే, ఆయనంతట ఆయనే హాయిగా పోయారండీ..!!"
_____________________________

"
చిరంజీవి కొడుకు సినిమా పేరు చిరుత, చిరు తనయ అయితే... మరి మిగతా హీరోల కొడుకుల సినిమాలు ఏమి అవ్వచ్చు?" అడిగాడు రాజు

"
బాలకృష్ణ
కొడుకు- బుడత, వెంకటేష్ కొడుకు-ఉడత, మోహన్‌బాబు కొడుకు-మిడత, పవన్ కళ్యాణ్
కొడుకు-పిచుక" అని వచ్చేస్తాయోమోరా" నవ్వుతూ చెప్పాడు వినోద్.

for more jok's on: http://nanigadu.tk (only for telugu jok's)

RAMAKRISHNAMRAJU
RAMAKRISHNAMRAJU
Moderator
Moderator

Surname : Champati
Gotram : Dhanumjaya
Male
Age : 32
Number of posts : 92
Job/hobbies : Designer/hobbies ante chala unnai navol chaduvutaa.. novala & stories rastaa.... (telugu & tamil lo) inka chinnapillalato aadokovadam ante chala chala istam, friends tho chating..........
Relationship Status : Single
Points :
0 / 1000 / 100

Reputation : 0
Registration date : 2009-07-01

View user profile http://telugukshatriyaas.blogspot.com

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum